October 16, 2025
News Telangana
Image default
PoliticalTelangana

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలవాలని ప్రత్యేక పూజలు

వెల్గటూర్, డిసెంబర్ 01 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్ నాయకులు సప్పా లింగయ్య, కమ్మరి శ్రీధర్, పాకాల నరేష్ గౌడ్, హరి ప్రసాద్, తోగిటి రమేష్, సంగేపు రాజయ్య, వార్డు సభ్యులు పాదం దుబ్బ స్వామి, యాగండ్ల గంగయ్య, అవ్వ సాయి, గుర్రం మహేష్, పాదం తిరుపతి, గొంటి కిర్టి వెల్గటూర్ మండలం స్తంభంపెల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్ష్మణ్ కుమార్ గెలవగానే ప్రజలకు ఉపయోగపడే ఆరు గ్యారెంటీ పథకాల హామీలు అమల్లోకి వస్తాయని, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు లక్ష్మణ్ కుమార్ తీరుస్తాడని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.

0Shares

Related posts

కడిగిన ముత్యంల జైలు నుండి బయటకు వచ్చిన కవితక్క

News Telangana

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

News Telangana

న్యూస్ తెలంగాణ ఎఫెక్ట్..! ఫుట్ పాత్ దురాక్రమణలు తొలగిస్తున్న అధికారులు

News Telangana

Leave a Comment