July 21, 2025
News Telangana
Image default
PoliticalTelangana

నవ శకానికి నాంది…!

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలది చారిత్రాత్మక తీర్పు
  • పాలేరులో భారీ మెజారిటీ అందించిన ప్రజలకు శిరస్సు వంచి వందనాలు
  • సుపరిపాలన అందించి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటాం
  • పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం , న్యూస్ తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు నవశకానికి నాంది పలుకుతూ..మొత్తo పది సీట్లకు గాను..9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం హర్షణీయమని కాంగ్రెస్ పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆనంద వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో 56,460 ఓట్ల భారీ మెజారిటీ తో పాలేరులో తనను గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరంకుశ బీఆర్ఎస్ పాలకులను ఇంటికి సాగనంపి , కాంగ్రెస్ కు పట్టం కట్టడం పట్ల ఆనంద వ్యక్తం చేశారు. పాలేరు తో పాటు మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం ద్వారా సుపరిపాలన అందించి వారి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

0Shares

Related posts

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన

News Telangana

బిగ్ బాస్ నిర్వహకుడు అక్కినేని నాగార్జునను అరెస్టు చేయండి

News Telangana

బిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం – ఎంపీ మలోతు కవిత.

News Telangana

Leave a Comment