July 20, 2025
News Telangana
Image default
PoliticalTelangana

తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ? తుమ్మల నాగేశ్వరరావు

News Telangana ” Khammam :- తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేసీఆర్‌పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. గతంలో గులాబీ బాస్ తమపై చేసిన విమర్శలకు గెలుపుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేసీఆర్‌పై సెటైర్ వేశారు. తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేనా?కేసీఆర్‌ ఉద్దేశిస్తూ తుమ్మల నాగేశ్వర్ రావు ఇవాళ ఎక్స్‌లో ట్విట్టర్ ఎద్దేవా చేశారు. తుమ్మల పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పంది స్తున్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాధ సభలో కేసీఆర్ తుమ్మలపై సెటైర్లు వేశారు. ఖమ్మం ప్రజలకు పువ్వాడ పువ్వులు కావాలా.. తుమ్మల తుప్పలు కావాలా..? ఎన్నికల్లో తుమ్మలను గెలిపిస్తే మీకు తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని గులాబీ బాస్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు తుమ్మల ఖమ్మంలో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ తరుఫున ఖమ్మం నుండి బరిలోకి దిగన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌పై 40 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

0Shares

Related posts

తెలంగాణ రైతులందరికీ నేటి నుండి పెట్టుబడి సహాయం: సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి :ఆ పై బదిలీ

News Telangana

క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ లక్ష్మీ

News Telangana

Leave a Comment