October 17, 2025
News Telangana
Image default
AndhrapradeshPolitical

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురంకు చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిచనున్నారు. ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు..

0Shares

Related posts

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

News Telangana

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ల పై కేసు నమోదు

News Telangana

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

News Telangana

Leave a Comment