October 17, 2025
News Telangana
Image default
PoliticalTelangana

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా..రాజా సింగ్

హైదరాబాద్ ( News Telangana ) : పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాన‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు. గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారు. నిధులు ఇటలీ నుండి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారా చెప్పాలన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని, మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8మంది ఎమ్మెల్యేలము కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు.. కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ లు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని చెప్పామన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటి లతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.

0Shares

Related posts

డాక్టర్ గోలి వేణురెడ్డి కి మద్ది యుగంధర్ రెడ్డి శుభాకాంక్షలు

News Telangana

ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

News Telangana

చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్లు… అక్కడ అంతా ” మనీ “

News Telangana

Leave a Comment