October 16, 2025
News Telangana
Image default
PoliticalTelangana

నేడు మేడారం జాతర పై మంత్రి సీతక్క సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
తెలంగాణ రాష్ట్రంలోని మహా జాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరపై మంత్రి సీతక్క స‌మావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు బయలు దేరి ములుగులోని మహమ్మద్ గౌస్ పల్లి కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నాం ములుగు గట్టమ్మ నుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరిన ఆనంతరం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మవన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించ‌నున్నారు. అనంత‌రం జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతరపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు

0Shares

Related posts

ఇల్లు రాని వారు ఎవరు అధైర్య పడకండి

News Telangana

నాకు తెలియకుండా ఒక్క పేపరు బయటకు పోవద్దు: సిఎస్ శాంతి కుమారి

News Telangana

‘ధరణి’పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు

News Telangana

Leave a Comment