July 20, 2025
News Telangana
Image default
Andhrapradesh

కృష్ణా జిల్లాలో అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

కృష్ణాజిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- ఏపీలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకావారి పాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకావారి పాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే..ఆర్టీసీ బస్సు పల్టీకొట్టినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీస్ వారికి సమాచారం అందించారు. హుటా హుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయటపడ్డారు

0Shares

Related posts

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

వైజాగ్ ఇండిస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

News Telangana

బెజవాడలో ఫ్లెక్సీ వార్

News Telangana

Leave a Comment