July 20, 2025
News Telangana
Image default
AndhrapradeshPolitical

NagaBabu: అది అబద్ధపు ప్రచారం రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు : నాగబాబు

నెల్లూరు ( News Telangana ): రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది..

ఇందులో నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతల అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

”అక్రమ మైనింగ్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు సమయం లేక వెళ్లలేదు. నాకు ఏపీ, తెలంగాణలో ఓటు ఉందనేది అసత్యం. హైదరాబాద్‌లో ఓటు ఉంది కానీ, మొన్నటి ఎన్నికల్లో వేయలేదు. మంగళగిరికి వచ్చేయడంతో ఓటు మార్చాలని దరఖాస్తు చేశా. వైనాట్‌ 175 అని వైకాపా అంటోంది. మేం వైనాట్‌ వైకాపా జీరో అంటాం. ఏ నాయకుడైనా ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచన చేయకూడదు” అని నాగబాబు అన్నారు..

0Shares

Related posts

పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొనున్న మూసీ నది తీర ప్రాంతాలు?

News Telangana

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana

సిఎం రేవంత్ రెడ్డి కి “టీజేఎస్ఎస్” విన్నపం

News Telangana

Leave a Comment