July 21, 2025
News Telangana
Image default
Telangana

హీరో వెంకటేష్ సోదరుడు సురేష్ లపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

హైదరాబాద్, జనవరి 29 ( న్యూస్ తెలంగాణ ) :-
ఒక స్థలవివాదం కేసులో హీరో వెంకటేశ్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది.

వెంకటేశ్ తోపాటు ఆయన సోదరుడు సురేశ్, ఆయన కుమారులు, హీరో రానా, అభిరామ్ లపై కేసులు పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ లోని డక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

డక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన కేసుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబ సభ్యులు డక్కన్ కిచెన్ కూల్చివేశారని, 60మంది బౌన్సర్లను పెట్టి కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ధ్వంసం చేసి, ఫర్నిచర్ ను ఎత్తుకెళ్లి పోయారని ఆయన ఆరోపించారు.

తనకు రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. లీజు విషయంలో తనకు సానుకూలంగా కోర్టు ఆదేశాలు ఉన్నా దగ్గుబాటి కుటుంబ సభ్యులు లెక్కచేయలేదని నంద కుమార్ పేర్కొన్నారు.

బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు… వెంకటేశ్, సురేశ్, రానా, అభిరామ్ లపై ఐపిసి 448, 452, 380, 506, 120బి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది

0Shares

Related posts

చెట్లను నరకొద్దు అంటూ అధికారులను ఎదిరించిన బాలుడు

News Telangana

Ts Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

News Telangana

విద్యార్థినిపై శ్రీ చైతన్య పాఠశాల టీచర్ తిట్ల దండకం…?

News Telangana

Leave a Comment