October 16, 2025
News Telangana
Image default
FoodLife StyleTelangana

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రక్షణ కల్పించిన రేవంత్ సర్కార్

హైదరాబాద్, ( News Telangana ) :-
హైదరాబాద్ లోని ఇన్‌ఆర్బిట్‌మాల్‌ సమీపంలో ఉన్న ITC కోహినూర్‌ దగ్గర్లో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌‌ ఉంటుంది..సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె ఫేమస్ అయ్యింది.

కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేయడానికి జనంతో పాటు, ఫుడ్ వ్లాగర్స్..అలాగే సినీ తారలు సైతం ప్రమోషన్స్ కోసం ఆంటీ వద్దకు వస్తుండటంతో మరింత క్రేజ్ చేకూరింది.ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు.ఇదంతా సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో CMO జోక్యం చేసుకుంది. ఆమె యధావిధిగా అక్కడే ఫుడ్‌ ట్రక్‌ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది..అంతేకాకుండా త్వరలో కుమారిఆంటీ షాప్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లే చాన్స్‌ కూడా ఉంది. ఈ క్రమంలో తనకు పర్మిషన్ ఇవ్వడంపై కుమారీ ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు.

తమ పక్షాన నిలిచినిందకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటా మని.. ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా.. ఏర్పాట్లు చేసుకుంటామని,కుమారి ఆంటీ తెలిపారు.

0Shares

Related posts

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది

News Telangana

సీఎం పర్యటనపై హెలిప్యాడ్ ను పరిశీలించి కలెక్టర్,ఎస్పీ

News Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

News Telangana

Leave a Comment