October 16, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

ఎండపల్లి, ఫిబ్రవరి12 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన కన్నం నవీన్ (25) గత మూడు సంవత్సరాలుగా మానసిక ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతు మందులు వాడుతున్నాడు. జనవరి 17 బుధవారం రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స అనంతరం నవీన్ ఆరోగ్యం మెరుగుపడగా ఇంటికి తీసుకువచ్చారు, మళ్ళీ ఫిబ్రవరి 3 శనివారం రోజున శరీరంలో వాపులు, తదితర లక్షణాలు కనిపించగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా. చికిత్స పొందుతూ ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించాడని మృతుని దగ్గర బంధువు తాత వరుస అయిన నేరెళ్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.

0Shares

Related posts

బరి తెగించేశారు

News Telangana

అమీన్పూర్ డబల్ బెడ్ రూమ్ వాసులకు బస్సు సౌకర్యం కల్పించాలి…

News Telangana

దినేష్ జన్మదిన వేడుక

News Telangana

Leave a Comment