October 16, 2025
News Telangana
Image default
Telangana

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

హైదరాబాద్‌ ( న్యూస్ తెలంగాణ ) :-
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి.

ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు ల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. సోమవారం ఫలితాలతోపాటు తుది కీ”ని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది.

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలు జరిగాయి.పేపర్‌ -1కు 12, 21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 (95.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆరిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీ ప్లానింగ్‌, వంటి సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 55,493,75శాతం, మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఫలితాల కోసం https://jeemain.nta.ac.inను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది

0Shares

Related posts

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

News Telangana

వేములవాడలో అది శ్రీనివాస్ ఘనవిజయం

News Telangana

లద్నుర్ లో ఘనంగా చిల్డ్రన్స్ మిని క్రిస్మస్ వేడుకలు

News Telangana

Leave a Comment