July 21, 2025
News Telangana
Image default
NationalTelangana

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

News Telangana :-

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తుండగా, కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వేను దేశానికి జీవనాడి అని పిలవడానికి కారణం ఇదే. సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే ముందుగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయినట్లు ఉండదు. కానీ డబ్బులు మాత్రం బ్యాంకు అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయిపోతుంటాయి. కానీ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ముందుగానే చెల్లించకుండానే మీరు రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ ఎంపిక ఐఆర్‌సీటీసీ i-Pay చెల్లింపు గేట్‌వేలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని ‘ఆటోపే’ అని పిలుస్తారు. ఇక నుంచి ఐఆర్​సీటీసీ యాప్​/వెబ్​సైట్ ​ద్వారా టికెట్​ బుక్​ చేసుకున్నాక కన్ఫర్మేషన్​ రాకపోతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్​ కన్ఫర్మ్​ అయ్యాకే కట్టవచ్చు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం ఐపే చెల్లింపు గేట్‌వే ఆటోపే ఫీచర్ యూపీఐ, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లతో పనిచేస్తుంది. ఇందులో రైల్వే టిక్కెట్‌కు సంబంధించిన పీఎన్‌ఆర్‌ను రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసివేయబడుతుంది. అధిక-విలువైన రైల్వే ఇ-టికెట్లను బుక్ చేసుకునే వారికి లేదా వెయిట్‌లిస్ట్ లేదా తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ ఈ సదుపాయాన్ని 2021 ప్రారంభంలో ప్రారంభించింది. IRCTC-iPay ద్వారా చెల్లింపు చేయడానికి, వినియోగదారులు వారి UPI బ్యాంక్ ఖాతా డెబిట్ కార్డ్ లేదా ఏదైనా ఇతర చెల్లింపు ఫారమ్‌ను ఉపయోగించడానికి అనుమతి, వివరాలను అందించాలి. వినియోగదారులు ఐఆర్‌సీటీసీలో భవిష్యత్ లావాదేవీల కోసం కూడా ఈ వివరాలను ఉపయోగించవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే మీరు ఐఆర్‌సీటీసీ ఐపే ద్వారా కూడా తక్షణ రీఫండ్ పొందుతారు. ఐఆర్‌సీటీసీ ప్రకారం.. ఆటోపే యాప్ సదుపాయం వినియోగదారులకు టిక్కెట్లను బుక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. టిక్కెట్ రద్దు విషయంలో వాపసు ప్రక్రియ కూడా సులభం. దీని వల్ల వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతుంది. ఒక వేళ మీరు టికెట్స్‌ బుక్‌ చేస్తున్న సమయంలో కన్ఫర్మ్‌ చేసిన టికెట్స్‌ విఫలమైతే ఆ డబ్బు వెంటనే మీకు రీఫండ్‌ అందుతుంది.

0Shares

Related posts

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలవాలని ప్రత్యేక పూజలు

News Telangana

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

News Telangana

లద్నుర్ లో ఘనంగా చిల్డ్రన్స్ మిని క్రిస్మస్ వేడుకలు

News Telangana

Leave a Comment