July 20, 2025
News Telangana
Image default
Telangana

నేడు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

ములుగు జిల్లా / న్యూస్ తెలంగాణ :-
రెండు సంవత్సరాల కొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగు తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 70 రోజుల క్రితం మార్పు కోసం ప్రజల దీవెనతో సమ్మక్క, సారక్క తల్లుల దీవెనలతో తెలం గాణాలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో జాతర జరుగుతుందని కొనియాడారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరిగిందని, ఒక పక్క అసెంబ్లీ నడు స్తున్న భక్తుల సౌకర్యం కోసం మంత్రి సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షి స్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. అంటే ప్రభుత్వానికి, ప్రజలు, భక్తుల పట్ల ఎంతో చిత్త శుద్ది ఉందో తెలుస్తుందని మెచ్చుకున్నారు.గత ప్రభుత్వం మేడారం జాతరకు 75 కోట్లు ఖర్చుపెడితే ఈ ప్రభుత్వం నష్టాలలో ఉన్నా రూ.110 కోట్లు మంజూరు చేసిందని, ఈ నెల 21 నుంచి 26 వరకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని, ఇంకా 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నా రని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో 3వేల బస్సులు నడిపితే, ఈ ప్రభుత్వంలో 6వేల ఆర్టిసి బస్సులు జాతరకు నడుపు తున్నామని, ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, జీరో టిక్కెట్టుపై ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని స్పషటం చేశారు. జాతర నిర్వహణకు 16 వేల మంది అధికారులు పనిచే స్తున్నారని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికు లను నియమించామని, గతం మేడారం జాతరపై అను భవం ఉన్న ఐదుగురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారు లను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని పొంగులేటి పేర్కొన్నారు

0Shares

Related posts

Komuravelli: కొమురెల్లి మల్లన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది

News Telangana

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana

ఎల్లారెడ్డిపేట్ పోలీసుల సాహసం

News Telangana

Leave a Comment