October 16, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

బస్టాండ్‌ సెంటర్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడు

సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ కోదాడ ఫిబ్రవరి 25/కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో గంజాయి అమ్ముతూ కోదాడ భవాని నగర్ కు చెందిన బొజ్జ అనిల్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కోదాడ పట్టిన సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం అనిల్ కుమార్ హైదరాబాద్ లో ఫార్మసీ చదువుతూ కోదాడకు చెందిన అడవి రాఘవతో కలిసి సిగరెట్ గంజాయి తాగే అలవాటు పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో రాఘవ కు పరిచయమైన జగ్గయ్యపేట కు చెందిన బొజ్జ గాని రోహిత్ వద్ద నుంచి తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి కొంత వారు తాగుతూ మరికొంత గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో ఆదివారం కోదాడ బస్టాండ్ లో అనిల్ కుమార్ గంజాయి ఇతర వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అనిల్ కుమార్ వద్దనుండి 2000 విలువగల 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.గంజాయి అమ్మకం తో సంబంధం ఉన్న అడవి రాఘవ బొజ్జ గాని రోహితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఈ మేరకు పట్టుబడ్డ నిందితుడిని రిమాండ్ కు హాజరు పరిచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి ,సిబ్బంది ఎల్లారెడ్డి,గట్టు సతీష్ నాయుడు, కొండలువెంకటేశ్ ఉన్నార్

0Shares

Related posts

మానవత్వాన్ని చాటుకున్న అవునూర్ గ్రామస్తులు

News Telangana

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీర్ల ఐలయ్యకు శుభాకాంక్షలు

News Telangana

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

News Telangana

Leave a Comment