October 15, 2025
News Telangana
Image default
Telangana

సిరిసిల్ల లో డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

సిరిసిల్ల పట్టణంలో డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఉధ్యమ నాయకుడు లింగంపల్లి మధూకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లింగంపల్లి మధూకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి పోరాటంలో డాక్టర్ పిడమర్తి రవి పాత్ర ప్రధానమైనదని ప్రతి పల్లెలో యువతను తెలంగాణ ఉద్యమం వైపునకు కదిలించిందన్నారు వివిధ సంఘాలు, పార్టీలుగా విడిపోయిన విద్యార్థి, యువకులను ఐక్య కార్యాచరణ కమిటీ తో ఒక్క దగ్గరకి చేసి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మమేకం చేసిన స్పూర్తిదాయకమైన నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి అని ఆనాటి విద్యార్థి యువకుల పోరాటంతోనే నాటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పిడమర్తి రవి నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నాడని తనకు సముచితమైన స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంగ శ్రవణ్ బాబు, లింగంపల్లి రాజు,పంగజాని,గసికంటి నరేంధర్,లింగంపల్లి గణేష్, అవినాష్,మాధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

0Shares

Related posts

అక్రమ మత్తులో రవాణా శాఖ అధికారులు..?

News Telangana

ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం.. ASI, CI పై దాడి

News Telangana

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

News Telangana

Leave a Comment