October 16, 2025
News Telangana
Image default
Telangana

కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొని రైతులను ఆదుకోండి

  • బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు

ఎండపల్లి, మే17 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా బిజెపి ఎండపల్లి మండల శాఖ తరపున ఎండపల్లి ఎమ్మార్వో కడార్ల రవికాంత్ కు వడ్లు కొనాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మపురి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మాట్లాడుతూ…. గత నలభై రోజులు నుండి ఐకేపి కేంద్రములో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదని, తప్ప, తాలు అని కోత పెడుతున్నారని, తూకం వేసిన బస్తాలు కూడా లారీ దొరకడం లేదని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాల వలన రైతన్నలు నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. రైతు లేనిదే రాజ్యం లేదని సామెత తప్ప నిజ జీవితంలో రైతు సమస్యలను పట్టించుకొనే అధికారులు లేరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రావు హనుమంతరావు, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ప్రధాన కార్యదర్శులు పొన్నం నరేష్ గౌడ్, మంచికట్ల రవి, జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షులు దుర్గం రమేష్, బిజేవైయం అధ్యక్షులు జక్కుల సాగర్ యాదవ్, కిసాన్ మోర్చ అధ్యక్షులు కొయ్యడ రజినీకాంత్ యాదవ్, ఓబీసీ మోర్చ అధ్యక్షులు దివాకర్ గౌడ్, కోశాధికారి పోచంపల్లి శ్రీధర్, మండల కార్యధర్శులు పొన్నం కిరణ్ గౌడ్, కోదురుపాక అశోక్,
జిల్లా నాయకులు బండి రవీందర్, శక్తి కేంద్రం ఇన్చార్జి మేడిపల్లి రామాంజనేయులు, బూత్ అధ్యక్షులు మెరుగు తిరుపతి, నాయకులు తిరుమల ప్రమోద్, అల్లంల సంజీవ్, గంగుల సతన్న తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

పొగాకు వ్యతిరేక అవగాహనా సదస్సు

News Telangana

సామాజిక చైతన్యానికి లక్ష్మణ్ చేసిన కృషి చిరస్మరణీయం ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు

News Telangana

శ్రీ వివేకవర్ధినిలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

News Telangana

Leave a Comment