October 16, 2025
News Telangana
Image default
Telangana

ముస్తాబాద్ లో మరో శంకర్ దాదా

  • ఎలాంటి పేరు, ఊరు లేని హాస్పిటల్…?
  • సొంతంగా ల్యాబ్, మెడికల్ నిర్వహణ.
  • తన ఇంటినే వైద్యాశాల గా మార్చిన వైనం.!
  • గత 5 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న చర్యలు శూన్యం.!
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు వైద్యం.
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు పోతే బాద్యులు ఎవరు…?
  • హాస్పిటళ్ళకు రిఫర్ చేస్తూ దండుకుంటున్న ముక్తారు.
  • శంకర్ దాదా లేని సమయంలో కూడా ఏటీఎం ద్వారా ప్రజలకు వైద్యం..!
  • జిల్లా అధికారులు చర్యలు చేపడతారా..? లేదా మరో ఎపిసోడ్ లో మీ ముందుకు..!

స్టేట్ బ్యూరో //న్యూస్ తెలంగాణ :- శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూసాం కదా అందులో తనకు అసిస్టెంట్ అనగా (ఏటీఎం )ఉన్నడని వాళ్లు ను సినిమా లో చూశాం. కానీ అలాంటి సీను మన జిల్లా చూస్తున్నాం. జిల్లాలో శంకర్ దాదా ఎంబిబిఎస్ అవతారంలో ప్రజలకు వైద్యం చేస్తూ తన ఇంటిని సైతం వైద్యశాలగా మార్చి వైద్యం చేస్తున్న ఓ వైద్యుడు..! తాను లేని సమయం లో కూడా ఓ అసిస్టెంట్ ద్వారా వచ్చిన రోగులకు చేపిస్తున్న వైనం. నిబంధనలు విరుద్ధంగా ఇష్టం సారంగా ప్రజలకు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పట్టించుకోని నాథుడే కరువైంది.రోగుల దగ్గర అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడని, తనకు నచ్చిన హాస్పిటల్కు రిఫర్ చేస్తూ అడ్డగోలుగా దండుకుంటున్న అతని పై చర్యలు శూన్యం అని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దందా ఆగేనా అరికట్టేది ఎవరు అంటూ వేచి చూస్తున్న ప్రజలు..! వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తన ఇంటిని సైతం వైద్యశాలగా మార్చి ఇస్తానుసారంగా వైద్యం చేస్తున్న డాక్టర్ ముక్తార్. నిబంధనలు గాలికి వదిలేసి ల్యాబ్, మెడికల్, పడగల నిర్వాహన చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు.అడ్డగోలుగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.గత 5 సంవత్సరాలుగా ముస్తాబాద్ లో వైద్యం చేస్తున్న చర్యలు శూన్యం అంటూ… పట్టించుకునే నాధుడు కరువైందని వాపోయారు. చిన్నపాటి టాబ్లెట్లు వేసుకుంటేనే భయపడే కాలంలో ఏకంగా తన ఇంట్లోనే వైద్యశాలగా మార్చి వైద్యం చేస్తున్నాడని తెలిపారు.జిల్లా అధికారులు స్పందించి ఈ దందా ను అరికాడుతారా…? అని ప్రజలు వేచిచుస్తున్నారు..!అధికారులు ఈ దందా పై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని కథనలతో మీ న్యూస్ తెలంగాణ లో మీ ముందుకు….!

0Shares

Related posts

న్యూస్ తెలంగాణ ఎఫెక్ట్..! ఫుట్ పాత్ దురాక్రమణలు తొలగిస్తున్న అధికారులు

News Telangana

టీబి విజేతను శాలువాతో సత్కారించిన వైద్య సిబ్బంది.

News Telangana

కారు అదుపుతప్పి నలుగురికి గాయాలు

News Telangana

Leave a Comment