
News Telangana / ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం 30 ఏళ్ల కల: దామోదర ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం తెలంగాణ ప్రజల 30 ఏళ్ల కల అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 26.3 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్‌మెంట్స్ నడుస్తాయని.. ఎమర్జెన్సీ సేవలకు హెలిప్యాడ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. రూ.2700 కోట్లతో.. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు రాజనర్సింహ వెల్లడించారు.
#NewsTelangana #NewsTelanganaTv