October 16, 2025
News Telangana
Image default
Telangana

నిర్మలమ్మ బడ్జెట్ పై కోటి ఆశలు

News Telangana / మరికాసేపట్లో ప్రవేశపెట్ట బోయే కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది, ఉదయం 11 గంటలకు లోకసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,కేంద్ర బడ్జెట్ 2025-26ను నేడు పార్ల మెంట్ లో ప్రవేశపెట్టను న్నారు. ఆమె బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఇది 8వ సారి కావడం విశేషం. కాగా కేంద్ర బడ్జెట్ పై సామాన్యులు మధ్య తరగతి ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా ఆదాయపన్నుపై భారీ ఊరట కలిగిస్తారేమో నని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వార్షికంగా రూ 15లక్షల వరకు సంపాదిస్తున్నవారు తమకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుం దని ఆశిస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 75,000 నుంచి రూ. 1లక్షకు పెంచడంతో కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా ఉంటుం దని అంచనా వేస్తున్నారు. అదనంగా సెక్షన్ 87ఏ కింద రాయితీని రూ. 10లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. ఈ పార్లెమంట్ సమావేశా ల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్లు సమర్పించి తన రికార్డును తానే బద్దలు కొట్టనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1959-64, 1976-69 మధ్య కాలంలో పది బడ్జెట్లతో అత్యధిక బడ్జెట్ ను సమర్పించి రికార్డును కలిగి ఉన్నారు. ఇతర ప్రముక ఆర్థిక మంత్రులతో 9బడ్జెట్లతో పి. చిదంబరం, 8 బడ్జెట్లతో ప్రణబ్ ముఖర్జీ వరుసలో ఉన్నారు.

0Shares

Related posts

పోషణ్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్

News Telangana

లోకాయుక్తలో కేసు నడుస్తున్నప్పటికీ ఆగని ”మాజీ సర్పంచ్ భర్త” ఆగడాలు

News Telangana

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

News Telangana

Leave a Comment