October 16, 2025
News Telangana
Image default
Telangana

అక్రమంగా తరలించిన పిడిఎస్ బియ్యం పట్టివేత

కేసముద్రం,ఫిబ్రవరి 14, న్యూస్ తెలంగాణ:కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని మహమూద్ పట్నం లో శుక్రవారం తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు దాడులు నిర్వహించి వీరాంజనేయ బిన్నీ రైస్ మిల్లులో 14 సంచులలో దాదాపు 15 క్వింటాల పిడిఎస్ బియ్యంను డి ఎఫ్ ఎస్ ఓ ప్రేమ్ కుమార్ పట్టుకున్నారు. మిల్లు యజమానిని విచారించగా బియ్యాన్ని నూకలుగా చేసి ఒక కిలో 12 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు.అయితే ఇందులో పిడిఎస్ బియ్యం సీలుతో ఉన్న బస్తాలు ఉండడంతో డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.ఇలాంటి చర్యలకు,అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యజమాన్యం పై తగిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు ఉపేక్షించదని, ఇకనుండి పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాలపై నిఘా పెట్టామని కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఎస్ఓ తెలిపారు.

0Shares

Related posts

భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు మట్టే ఆధారం : మద్దూరు ఏ ఈ ఓ రాకేష్

News Telangana

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత

News Telangana

Leave a Comment