
- మృతుని అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, ఫిబ్రవరి 14 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిశేలపేట గ్రామంలో ముస్కు రాజేందర్ రెడ్డి (35) అనే యువరైతు బ్రెయిన్ స్ట్రోక్ తో వారం రోజులు పోరాటం చేసి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజేందర్ రెడ్డి ఈ నెల 6వ తేది గురువారం రోజున ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో తల తిరిగి స్పృహ కోల్పోగా వెంటనే వారి కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు సిటీ స్కాన్ పరీక్ష నిర్వహించి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో 10 తేదీ సోమవారం రోజున మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ పట్టణానికి తరలించడం జరిగింది. అక్కడి వైద్యులు రాజేందర్ రెడ్డికి అన్ని రకాల వైద్య సేవలు అందించిన ప్రాణాలు నిలబెట్ట లేకపోయారు, వైద్యులు చివరగా బ్రెయిన్ డెడ్ తో మరణించాడని నిర్ధారించారు. ఈ సందర్భంగా మృతుని అవయవాలను దానం చేయాలని వైద్యులు వారి కుటుంబ సభ్యులను కోరగా, అతని అవయవాలు పలువురి ప్రాణాలు కాపాడటంలో సహాయపడతాయని ఉద్దేశించి అవయవాలు దానం చేసినట్టు మృతుని కుటుంబ సభ్యులు, అన్న అయిన వెల్గటూర్ తాజా మాజీ వైస్ ఎంపీపీ ముసుకు కవిత – దేవేందర్ రెడ్డి లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయి, పలువురి ప్రాణాలను నిలబెట్టడానికి అతని అవయవాలు దానం చేసిన మృతుడు ముస్కు రాజేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం.