
ప్రజా సేవకుడు ‘యాకాంతం గౌడ్’
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పరుపాటి వెంకట్ రెడ్డి
ఘనంగా యువ నేత యాకాంతం గౌడ్ జన్మదిన వేడుకలు
పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా-చిర్ర యాకాంతం గౌడ్
కేసముద్రం,మార్చి 4, న్యూస్ తెలంగాణ: నిజమైన ప్రజా సేవకుడు చిర్ర యాకాంతం గౌడ అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ యువజన విభాగం డివిజన్ అధ్యక్షులు,ప్రముఖ విద్యాసంస్థల అధినేత, న్యూ జనరేషన్ ఆఫ్ డీకేపల్లి వ్యవస్థాపకులు చిర్ర యాకాంతం గౌడ్ 45 వ పుట్టినరోజు వేడుకలు యువజన నాయకులు కొమ్మినేని సందీప్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థను నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత స్థితికి తీసుకెళ్లిన గొప్ప విద్యావేత్త అని,పురిటి గడ్డ రుణం తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి నిజమైన ప్రజా సేవకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిన చిర్ర యాకాంతం గౌడ్ సేవలు మరువలేనివన్నారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
పుట్టినరోజు వేడుకల సందర్బంగా మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.విద్యాసంస్థల తో ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా,తన సేవా కార్యక్రమాల ద్వారా మానుకోట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని యాకాంతం గౌడ్ సేవలను కొనియాడారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పార్టీలకతీతంగా పాల్గొని సంబరాలు జరిపారు.