
- సరస్వతి నిలయాలను గెస్ట్ హౌస్ గా మార్చిన ఘటన
- క్రషర్ మిల్లుల యాజమాన్యాలు ఇతర రాష్ట్ర కూలీలకు పాఠశాలలో నివాస గృహాల ఏర్పాటు
- 5 సంవత్సరాల నుండి ఇదే తంతు
- మందుబాబుల అడ్డాగా ప్రాథమిక పాఠశాల భవనం
- విద్యాశాఖ అధికారులకు తెలిసిన పట్టించుకోని వైనం
- నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు

కోదాడ ప్రతినిధి, అనంతగిరి మార్చి 06 (న్యూస్ తెలంగాణ)
సరస్వతీ నిలయాలు కబ్జాదారుల గెస్ట్ హౌస్ లాగా మారుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల భవనాలు విద్యార్థులకు విద్యను అందించడానికి ఏర్పాటు చేస్తే ఆ పాఠశాల భవనాలలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల కబంధహస్తాలలో ఉండి ప్రైవేట్ వ్యక్తులకు ఎన్నో ఏళ్లుగా నివాస గృహాలుగా ఏర్పాటు చేస్తున్నారు పక్కన ఉన్న స్వంత క్రషర్ మిల్లుల కూలీలకు గెస్ట్ హౌస్ లా మార్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో వడ్డెర కాలనీలో 18 సంవత్సరాల క్రితం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు అక్కడనుండి స్థానిక మాజీ ప్రజాప్రతినిధి అక్కడ నివాసం ఉంటున్న వారిని పంపించేయడంతో కాలనీ వాసులు వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు పక్కనే ఉన్న క్రషర్ మిల్లు నిర్వహిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఆ భూమిపై కన్ను పడి స్వాధీన పరుచుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్పటినుంచి ఆ భూమి క్రషర్ మిల్లు అవసరాలకు ఉపయోగిస్తున్నారు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల కూడా క్రషర్ మిల్లులో పనిచేస్తున్న కూలీలకు నివాస గృహంగా ప్రాథమిక పాఠశాలలో వినియోగిస్తున్నారు రాత్రి సమయంలో కూలీలు పాఠశాలలో మద్యం సేవిస్తున్నట్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి దీనిపై గత మండల విద్యాధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం స్థానిక మాజీ ప్రజాప్రతినిధి కావడంతో ముక్కు మీద వ్రేలువేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం 18 సంవత్సరాల నుండి ప్రభుత్వం అందిస్తున్న గ్రాండ్స్ నిధులు కొందరు విద్యాశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డట్టు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారం తో పాఠశాలలను కబ్జాకు పాల్పడితే విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ విషయం వెలుగులోకి రావడానికి మండలంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ గా ఉన్న పురుషోత్తం అనే హెడ్మాస్టర్ పాఠశాలకు తనిఖీ చేయడానికి వెళ్ళగా అక్కడ ఉన్న వారు స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడు అనుమతితోనే పాఠశాలలో నివాసం ఉంటున్నట్లు హెడ్మాస్టర్ కు తెలిపినట్టు విశ్వసినీయ సమాచారం జరిగిన సంఘటన స్థానిక పోలీసులకు సమాచారం చేరవేసిన ఫిర్యాదు చేయడానికి అర్హులు కాదని జిల్లా అధికారులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని స్థానిక ఎస్సై చెప్పడంతో హెడ్మాస్టర్ వెనుతిరిగాడని గతంలో మండలంలో పనిచేసిన చేసిన ఎంఈఓ ప్రస్తుత ఎంఈఓ కూడా చూసి చూడనట్టు వెళ్లండని హెడ్మాస్టర్ తో అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి సంబంధిత అధికారులు ఆ హెడ్మాస్టర్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ వ్యక్తుల పరమయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాఠశాలను విద్యార్థులకు Unblock అందించే సరస్వతి నిలయాలుగా మారాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గరిడేపల్లి రాము న్యూస్ తెలంగాణ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్.
