
- లక్ష్మణరావు జ్ఞాపకార్థం వారి కుమారులు సబ్ స్టేషన్ కు 5 గుంటల భూమి విరాళం
కేసముద్రం,మార్చి 6, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మున్సిపాలిటీ లోని విలేజ్ కేసముద్రం లో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు విలేజ్ కేసముద్రం కు చెందిన చిల్లంచర్ల లక్ష్మణ్ రావు జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఐదు గుంటల భూమిని తామే స్వయంగా విక్రయించి విరాళంగా అందజేయనున్నారు.ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వెంట రవాణా అథారిటీ సభ్యులు రావుల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిదురాల వసంతరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, వేణు,సంకేపల్లి జనార్దన్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు కనుకుల రాంబాబు తదితరులు ఉన్నారు.