July 23, 2025
News Telangana
Image default
Telangana

పసి పిల్లతో చెలగాటం ఆడుతున్న హాస్పిటల్

  • ఒకవైపు గోడల నిర్మాణ పనులు…మరో వైపు పిల్లలకు వైద్యం.
  • నిర్లక్ష్యపు సమాధానాలతో వ్యవహారిస్తున్న యాజమాన్యం.
  • ఎంతటి దూరమైన… ఎంతటి జ్వరమైన అతను చూసే వరకు వేచిచుడాల్సిందే…?
  • పేరు పొందిన డాక్టర్ అని…ఇంతటి నిర్లక్ష్యపి వైఖరి..!
  • జరగరాని ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరు…?

న్యూస్ తెలంగాణ //స్టేట్ ఇంచార్జి

పసి పిల్లలతో చెలగాటం ఆడుతూ ఇష్టం సారంగా వ్యవహరిస్తు ఒక వైపు గోడల నిర్మాణ పనులు చేస్తుండగా హాస్పిటల్ ఆవరణలో నే సిమెంట్ బాగులు పెట్టి పసి పిల్లలను మరింత ఇన్ఫెక్షన్ వైపు దిగదార్చుతున్నారు.ఎంతటి దూర ప్రాంతాల నుండి వచ్చిన….. ఎంతటి విష జ్వరం వచ్చినా….. రాత్రివేళ సమయం వరకు వేచి ఉండాల్సిందేనాని తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గత కొన్ని సంవత్సరాలుగా వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యులు సృజన్ పిల్లల హాస్పిటల్ వైద్యులు ప్రసాద్ రావు హాస్పిటల్ తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఒకవైపు హాస్పిటల్ పైకప్పు నిర్మాణ పనులు జరుగుతుండగా పైన గోడల నిర్మాణం కొనసాగిస్తూ మరో వైపు పసి పిల్లలకు వైద్యం అందిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండి పడుతున్నారు.హాస్పిటల్ ఆవరణలో సిమెంట్ బాగులు పెట్టి పిసి పిల్లలను మరింత ఇన్ఫెక్షన్ కు కారకులు అవుతున్నారని తల్లి దండ్రులు అంటున్నారు.మరోవైపు పసిపిల్లలకు జ్వరం వచ్చింది సార్ మా బిడ్డ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది డాక్టర్ దగ్గరికి పంపండి సారు అని కంపొండర్ లని బ్రతిమిలాడిన ఉదయం కాలం నుండి సాయం కాలమైన ఎలాంటి విష జ్వరం వచ్చిన మీ సీరియల్ సమయం వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందేనని వైద్యానికై వచ్చిన వారి తల్లి దండ్రులు పట్ల కరకాండుగా మాట్లాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేరు పొందిన వైద్యుల దగ్గరనే వైద్యం చేపిస్తారనే మొండి బుద్దితో మాట్లాడుతున్న హాస్పిటల్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకువాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధం….

హాస్పిటల్లో నిర్మాణ పనులకు జరుగుతుండగా హాస్పిటల్ లోనే సిమెంట్ బాగులు స్లాబ్ నిర్మాణనికి వాడే పెద్ద సపోర్ట్ కట్టెలు హాస్పిటల్ ఆవరణలో నే పెట్టి సిమెంట్ నీళ్లతో దుర్గంధం చేస్తూ పసి పిల్లలని కాపాడే డాక్టర్ పిల్లలు పట్ల నిర్లక్ష్యం వహిస్తూన్నారని పేర్కొన్నారు.అలాంటి సిమెంట్తో పసిపిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. పైనుండి ఇనుప జాకీలు గాని, రేకు డబ్బాలు గాని, ఏదైనా పరికరం చెయ్యి దాటి కింద పడితే పసి పిల్లల ప్రాణాలు తల్లిదండ్రుల ప్రాణాలు గాల్లో కలవాల్సిందే అని మండిపడుతున్నారు.హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా పసిపిల్లలకైనా తల్లిదండ్రుల కైనా మొత్తానికి ఒకటే బాత్రూం ఏర్పాటు చెయ్యగ మూత్రం విసర్జనకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు నెలకొంటున్నారు . ఆ బాత్రూం లోకి ఒకరు వెళ్లారంటే మరో నలుగురు వేచి ఉండాల్సిందే. ఎలాంటి పార్కింగ్ ఏర్పాటు చేయకుండా నడిరోడ్డు పైనే వాహనాలు నిలుపు తు వచ్చి పోయే వాహనదారులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. హాస్పిటల్లో ఎలాంటి ధరల పట్టిక ఏర్పాటు చేయక ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు.

  • హాస్పిటల్ పై చర్యలు శూన్యం

గత కొన్ని సంవత్సరాలుగా పసిపిల్లలకు వైద్యం అందిస్తూ పేరు పొందిన డాక్టర్ గా నిలిచిన సృజన్ పిల్లల హాస్పిటల్లో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ నిబంధన విరుద్ధంగా నడుస్తున్న పసి పిల్లలు ఉదయకాలం నుండి సాయంత్రం వేళ వరకు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు నమ్మకంతో వస్తూ పసి పిల్లని ఎలాగైనా కాపాడుకోవాలని వస్తే ఉదయం ఒపీ రాపిస్తే సాయంకాలం 6,7 గంటలు గడుస్తున్నా వారిని చూడకపోగా వారి ఓపిక భరిస్తూ పసిపిల్లల ప్రాణాలను కాపాడుకోవాలని వేచి చూస్తే ఎలాగైనా ఇక్కడనే ఉంటారు అనే భావనతో హాస్పిటల్ యాజమాన్యం ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళండి అనే వెక్కిరి మాటలతో అంటూ బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పసి పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఆ హాస్పిటల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లి దండ్రులు కోరుతున్నారు.

0Shares

Related posts

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన సిద్ధిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

News Telangana

Leave a Comment