July 22, 2025
News Telangana
Image default
Telangana

మీడియా పాలసీని ప్రకటించాలి -పురుషోత్తం నారగౌని

  • తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక.
  • పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి.
  • తెలంగాణ ప్రెస్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మంచిర్యాల, మార్చి 21 ( News Telangana ) :
ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోకుండా జర్నలిస్టుల సంబంధిత అవసరాలను పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైన మీడియా పాలసీని రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అధ్యకతన శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగినది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు మరియు ఛానల్ సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించి గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టి రుణభారంతో బ్రతుకులీడుస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. ఈ సందర్భంగా టి. ఎస్. జె. యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యూనియన్లు జర్నలిస్టు ల సంక్షేమం కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యాని అలా కాకుండా తాము ఒక ప్రత్యామ్నాయ జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చూట్టామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అవునూరి సంపత్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కె .సురేష్ పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా కమిటీ : జిల్లా అధ్యక్షుడిగా యు.రాజు పటేల్, ప్రధాన కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా ఎం.మనోజ్, ఉపాధ్యక్షులుగా బి.రాజశేఖర్, ఆర్.అరుణ్ కుమార్, కే. సారయ్య, బి. శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా టి. శ్రీనివాస్ ఎం వినోద్ ఏ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రాము, సూర్యనారాయణ, వెంకటేష్, లక్ష్మణ్, ఈసీ మెంబర్లుగా బి. వెంకటేష్, బి. రవీందర్, రాజేశ్వరరావు, షంషీద్, సతీష్ లు ఎన్నికయ్యారు.

0Shares

Related posts

నూతన గృహప్రవేశం చేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

News Telangana

గ్రీన్ ఫీల్డ్ వంతెన వద్ద ఉద్రిక్తత

News Telangana

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు

News Telangana

Leave a Comment