July 22, 2025
News Telangana
Image default
Telangana

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి …రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము

  • కులవృత్తిని నమ్ముకొని పేదరికంలోని మగ్గుతున్న రజకులు
  • అరకొర బడ్జెట్ తో సంక్షేమం సాధ్యం కాదు
  • ప్రభుత్వ బడ్జెట్లో రజకులకు ప్రాధాన్యత కల్పించాలి
  • రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము

అనంతగిరి ప్రతినిధి, మార్చి 21(న్యూస్ తెలంగాణ):

రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు రజక వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి ఆధారంగా బ్రతికే కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయిని, ప్రభుత్వం సంక్షేమానికి మరింత బడ్జెట్ పెంచి ఈ కేటాయింపులను సవరణ చేసి రజకుల సంక్షేమానికి రూ:1000 కోట్లు కేటాయించాలను రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
2025-06 సంవత్సర బడ్జెట్ లో రజక వృత్తిదారుల సంక్షేమానికి రూ:200కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఉచిత విద్యుత్ పథకానికి రూ:150కోట్లు, సంక్షేమ మోడ్రన్ ధోబీఘాట్లు నిర్మాణానికి కేవలం రూ:50 కోట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 4000 రజక సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఉన్నాయని వాటన్నిటికీ రుణాల ఇవ్వాలని తెలిపారు. రజక వృత్తిదారులు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారని వారిని ఆదుకోవడానికి అరకొర బడ్జెట్ తో సంక్షేమం సాధ్యం కాదని తెలంగాణ రజక వృత్తి దారుల కోరుకుంటున్నారు . మారిన వృత్తి పరిస్థితిలో వృత్తిలో వచ్చిన అధునాతన మార్పుల్ని వృత్తి శిక్షణ- ఉపాధి కల్పన ఆధునిక యాంత్రికరణ ధోబిఘాట్లను, నూతన డ్రై క్లీనింగ్ లాండ్రీలను నెలకొల్పడానికి ప్రభుత్వం రూ:10 లక్షల వరకు వృత్తిదారులకు ఇచ్చే విధంగా బడ్జెట్ ని పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వృత్తి పనిలోవృద్ధులు అయిన వాళ్లకి ప్రత్యేక పెన్షన్ స్కీం ఏర్పాటు చేయాలని,సామాజిక దాడులు దౌర్జన్యాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయాలనని రాము కోరారు.

0Shares

Related posts

క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ లక్ష్మీ

News Telangana

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

News Telangana

Leave a Comment