
- పార్టీ పురోగతిపై చర్చ
భద్రాద్రి జిల్లా బ్యూరో, మార్చి27 (న్యూస్ తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ శాసనసభ్యులు ‘పొదెం’ వీరయ్య గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో న్యూఢిల్లీలోని ఏఐసీసీ పంచాయతీరాజ్ సంఘటన కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, 2023 ఎన్నికల తర్వాత జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పొలిటికల్ సినారియో పై చేర్చించారు. పార్టీ పటిష్ట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర కార్యకలాపాలపై కూడా కులంకషంగా చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటానని, పార్టీ నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు త్వరలోనే లభిస్తుందని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారని ‘పొదెం’ వెల్లడించారు.