
ముదిగొండ ప్రతినిధి, ఏప్రిల్ 1 ( న్యూస్ తెలంగాణ ) :- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పథకాన్ని పేదలకు అందించి నిరుపేదల ఆకలి తీరుస్తున్నది. ప్రజా ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పథకం ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో అఖిలపక్ష నాయకులు, ఈ సన్నబియ్యాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముదిగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు మందరపు నాగేశ్వరరావు, మందరపు ఉపేంద్రరావు, ఉసికెల రమేష్, బట్టు పురుషోత్తం, మంకెన దామోదర్, కొమ్ము నరసింహ రావు, మాదల శ్రీనివాసరావు, ఎర్ర వెంకన్న మరియు తదితర గ్రామ నాయకులు, కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, గ్రామ పెద్దలు, ప్రజలు, పాల్గొన్నారు.