
- చనిపోయిన వ్యక్తి బ్రతీకొచ్చాడు ..?
- కోట్ల రూపాయల భూమికి సంతకం చేశాడు
- సాక్షాత్తు తహసీల్దార్ సారే ధ్రువీకరించడం గమనార్హం
- ఓ.ఆర్.ఆర్ ఆనుకొని ఉన్న భూమి పేరు మార్పిడి
( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు )

ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 06 (న్యూస్ తెలంగాణ) : – ప్రపంచంలో ఇప్పటివరకు 7 వింతలే అని అందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియని వింత ఎనిమిదవ వింత కూడా హన్మకొండ జిల్లాలో చోటు చేసుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యాన్ని గురీ చేస్తుంది. చనిపోయిన వ్యక్తే నేరుగా వచ్చి కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమినీ సంతకం పెట్టినట్టుగా నిర్ధారించిన స్థానిక తహసీల్దార్. వ్యక్తి చనిపోయి ఏళ్లు గడుస్తున్న తిరిగి వచ్చి కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమిని హనుమకొండ జిల్లాలో ఒక తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినట్టు ధృవీకరించినటువంటి తహసిల్దార్. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళే బై పాస్ రోడ్ నేషనల్ హైవే 163 నెంబర్ కు ఆనుకొని ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ఆధార్ కార్డులో ఫేస్ మార్ఫింగ్ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలను వాటాలుగా పంచుకున్న భూ అక్రమార్కులు మరియు తహసిల్దార్. అసలు పట్టాదారి మరణించడంతో వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్థానికంగా లేకపోవడం స్థానిక ఎమ్మార్వో భూ అక్రమార్కులతో చేతులు కలపడం ఈ తతంగానికి దారి తీసిన వైనం.
( ఇంతకు ఆ తహసిల్దార్ ఎవరు..? ఆ కోట్ల రూపాయల విలువచేసే భూమి ఎక్కడ …? అనేది మరో సంచికలో మీ ముందుకు న్యూస్ తెలంగాణ )