
- చనిపోయిన వ్యక్తి బ్రతికి వచ్చిన కథనంలో సంచలన విషయలు…?
- దాదాపు ఆధార్ కార్డు లేకముందే చనిపోయిన వ్యక్తి…
- చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డు సృష్టించారట..???
- అసలు ఈ తతంగం అంత చేయడానికి కారణం ఏంటి..?
- ఆ కార్యాలయంలో ఎంత మొత్తంలో చేతులు మారాయి…?
- కోట్ల రూపాయల భూమిలో భారీగా అధికారుల చేతి వాటం..
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 11(న్యూస్ తెలంగాణ): ఎనిమిదో వింత అని న్యూస్ తెలంగాణ దిన పత్రికలో గతంలో ప్రచురించిన విషయం విధితమే.అయితే మా పత్రిక చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూసాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమిని తప్పుడు దారిలో రిజిస్ట్రేషన్ చేశారట.అయితే గతంలో ఆధార్ కార్డు ప్రక్రియ మొదలు కాక ముందుకే ధర్మసాగర్ మండలానికి చెందిన రైతు మరణించాడటున్న గ్రామస్తులు.అటు పై వరంగల్ నుండి హైదరాబాద్ నేషనల్ హై వేకు పెరిగిన ట్రాఫిక్ దృశ్య ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భూముల ధరలకు కాస్త రెక్కలు వచ్చాయి.మరణించిన రైతు భూమి పై కన్నేసిన భూ కబ్జా దారులు ఆధార్ కార్డు మార్ఫింగ్ ద్వారా పెద్దమొత్తంలో వాటాలు మాట్లాడుకొని భూమి పేరు మార్పిడి ప్రక్రియను చేసినట్టుగా తెలుస్తుంది.మరణించిన వ్యక్తి కుటుంబీకులు ఎవరు కూడా స్థానికంగా ఉండకపోవడంతో వారి పని కాస్త సులువైందట.మరణించిన వ్యక్తి ఎవరు, ఆ భూమి ఎక్కడ,దాని మార్పిడిలో వారి వాటాలు ఏంటి అని విషయాల పై సమగ్ర విశ్లేషణ, విచారణతో మరో కథనంతో మీ ముందుకు మీ న్యూస్ తెలంగాణ.
