July 20, 2025
News Telangana
Image default
Telangana

కారు అదుపుతప్పి నలుగురికి గాయాలు

  • కారు అదుపుతప్పి నలుగురికి గాయాలు

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11 ( News Telangana ) :-

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో హైదరాబాద్- విజయవాడ 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కొలతరాయిని,రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్త,ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సూర్యాపేట వైపు నుండి కోదాడ వైపు వెళుతున్న కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

0Shares

Related posts

జేపీ గ్రూప్స్ అధినేత పాష చేతికి జై తెలంగాణ దినపత్రిక

News Telangana

బిగ్ బాస్ నిర్వహకుడు అక్కినేని నాగార్జునను అరెస్టు చేయండి

News Telangana

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

News Telangana

Leave a Comment