
సూర్యాపేట జిల్లా జిల్లా చిలుకూరు ఏప్రిల్ 19:( న్యూస్ తెలంగాణ )
మండలం లో ని గేటు ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ విద్యార్థిని ఈ రోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని పగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల లో చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున కృష్ణవేణి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉగాది కి ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం కళాశాలకు వచ్చింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్‌ల్లోనే గడిపింది. అనంతరం తెల్లవారుజామున తల్లి రూంలో ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
