
- దళారీ నుండి అధికారి దాకా.. !
- ముడుపులు ఇస్తే చాలు… కార్డులు వస్తాయి… !
- ఎవ్వరు చనిపోతారా అని ఎదురుచూస్తూ కూర్చుంటున్న ఏజెంట్లు
- బంధువులు రాకముందే మృతుదేహాల వద్ద రాబందుల్లా వాలిపోతారు…!
- ముఖ్యంగా వీటికోసమే కొన్ని మీ సేవలు కేంద్రాలుగా పనిచేస్తున్నాయి మరి…!
- కార్మిక శాఖలో కరప్షన్(చనిపోయిన వ్యక్తులకు కార్డులు వస్తాయి ఇక్కడ)
- రోడ్డు ప్రమాదంతో వ్యక్తి దుర్మరణం.. విషాదపు ఇంట కార్మిక శాఖ ఏజెంట్ల కోలాహలం… !

ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 21 (న్యూస్ తెలంగాణ):కార్మిక శాఖల పక్క కమర్షియల్.కాసుల పంటకు శాఖలో కొందరి వ్యక్తుల పునర్జీవం పోస్తారట.ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేబర్ కార్డుల రారాజుల పర్వం అంత ఇంత లేదట.ఏకంగా కార్డు లేని వ్యక్తులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మరునాడు ఉదయమే వారి ఇంటి ముందు వాలిపోతారట.రోడ్డు ప్రమాదాలే ఎందుకంటే ఇలా మరణించిన వారికి లేబర్ కార్డు ఉంటే అక్షరాల ఆరు లక్షల పై చిలుకు ప్రభుత్వం ఇస్తుంది.కావున దీన్ని అదునుగా చేసుకున్న శాఖలోని అధికారులు,దళారులు చనిపోయిన వ్యక్తికి కార్డు లేదు కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కలివిడిగా మెదిలి అంత మేము చూసుకుంటాము మేము చెప్పినట్టు చేస్తే మీకు సగం మాకు సగం అని అభాగ్యులకు ఆశలు చూపి ఇంతటి తతంగానికి ఒడిగడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులు ఎవరు.ఇంతకు ఎలా చేస్తున్నారు,దొంగ కార్డుల సృష్టి ఎక్కడ జరుగుతుంది,వీటి వెనకాల ఉన్న ఆ అధికారులు ఎవరు అనేది మరో సంచికలో మీ ముందుకు తీసుకువస్తాము.