- న్యూస్ తెలంగాణ పత్రికకి మరిన్ని ఆధారాలు…!
- జిల్లా ఉన్నతాధికారినే ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్న దళారి ఎవరు…?
- మాకేం ఊరికే చేయలేదు మధ్యవర్తికి సగం భూమి ఇచ్చాం…?
- అధికారికి రెండు లక్షల రూపాయలు అంట….!
- కలెక్టర్ చెప్తేనే పని అయిందట… నిజమేనా…?
- ఆ వ్యక్తి మాకు బాగా దగ్గర….!
- ఆ నలుగురికి నాలుగు భాగాలు ఇచ్చారట ఇంతకీ ఎవరా నలుగురు….?
- మహా అయితే ఎంక్వయిరీ చేయిస్తారు అంతకుమించి మీరు ఏం చేస్తారు…!
- బహిరంగంగానే అధికారుల పేర్లతో మాట ముచ్చట్లు..!

ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23(న్యూస్ తెలంగాణ): హనుమకొండ జిల్లాలో ఎనిమిదో వింత అనే కథనాన్ని న్యూస్ తెలంగాణ పత్రిక ప్రచురించడం జరిగింది. చనిపోయిన వ్యక్తి వచ్చి భూమార్పిడి ప్రక్రియకు సంతకం చేశాడా అనేది ఆశ్చర్యానికి గురిచేసిన తీరు. ఇదిలా ఉండగా తాసిల్దార్ సమక్షంలోనే భూమార్పిడి ప్రక్రియ జరుగుతుందని అందరికీ తెలిసిన విషయం. మరి నిజంగానే ఆ వ్యక్తి బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అనేది తేలాల్సిన వైనం. ఇందుకుగాను కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి భూమార్పిడి ప్రక్రియకు మాకు కలెక్టర్ చెప్తేనే పని జరిగింది.ఈ మార్పిడి కోసమని అధికారి 2 లక్షల రూపాయలు అడిగారు, గ్రామస్తులు మధ్యవర్తిత్వం వ్యవహరించినందుకు 20 గుంటల భూమి వారికి ఇచ్చాము,అయినా మేమేమైనా అన్యక్రాంతంగా చేసుకున్నామా, మహా అయితే మీ పత్రిక కథనాలతో ఎంక్వయిరీ చేస్తారు, అంతకుమించి మీరు చేసేదేముంది అంటూ బహిరంగంగానే అటెండర్ నుండి జిల్లా అధికారి దాకా అందరి పేర్లను వాడుతున్న భూదలారి. అతనిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేంటి..?.నిజంగానే ఇందులో అందరూ భాగస్వాములు అయ్యారా లేక అధికారుల పేర్లను అడ్డం పెట్టుకుంటూ యదేచ్చగా రియల్ మాఫియా వ్యాపారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.ఆ సేర్వే నెంబర్ ఎంత,ఏ గ్రామములో, కలెక్టర్ పెరు ఎందుకు వచ్చింది, ఆ కలెక్టర్ ఎవరు పూర్తిగా మరో సంచికలో