
- రాష్ట్రవ్యాప్తంగా 13 మంది నియామకం
న్యూస్ తెలంగాణ చిలుకూరు 27: అఖిల భారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చిలుకూరు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ వెంకటయ్య నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం చిలుకూరు విలేకరులకు తెలిపారు. ఈనెల 15.16.17. వ తేదీలతో తమిళనాడు రాష్ట్రం నాగపట్టణంలో జరిగిన అఖిలభారత రైతు సంఘం 30వ జాతీయ మహాసభలో తనను నియమకం చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 మందిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక చేయగా అందులో తాను ఉన్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అందరికీ చేయాలని డిమాండ్ చేశారు. పంటల భీమా పథకమును అమలు చేయాలని అన్నారు. రైతాంగం సమస్యలపై ఉద్యమాలు చేయనున్న ట్లుగా తెలిపారు. తన నియామకం కు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.