
- హనుమకొండ సబ్ రిజిస్టర్ విషయం మరువకముందే మరో ఘటన ..!
- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎల్ఆర్ఎస్ నిబంధనలు తుంగలో తొక్కినట్టేనా…?
- రియాల్టర్ల సొమ్ముకు అధికారులు కొమ్ముకాస్తున్నారా…?
- రోజురోజుకు రిజిస్ట్రేషన్ శాఖపై పెద్దమొత్తంలో వెలువెత్తుతున్న ఆరోపణలు
- సాక్షాత్తు శాఖ మంత్రి మాటలనే బేఖాతారు చేశారా…?
- ఎన్ని ఆరోపణలు వచ్చిన స్పందించని ఉన్నత అధికారులు…?
- గతంలో కోర్టు కేసులలో ఉన్న భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసిన ఇంచార్జి సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోకపోవడం అందుకేనా…?

ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్, మే 05(న్యూస్ తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లోకి వస్తున్న తీరు విధితమే. హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఖాళీ స్థలానికి ప్లాట్ నెంబర్ ఇచ్చి నగదు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు అని వచ్చిన ఆరోపణలు మరవక ముందే హన్మకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్ మండలం,ఉనికిచెర్ల గ్రామ శివారులో గల కాలి స్థలాలకు వ్యవసాయ భూమి నుండి భాగాలుగా నాల అనుమతులతో ప్లాట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారట.అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కలిగే ఇబ్బందుల దృశ్య సరైన ధ్రువపత్రాలు ఉన్నవారికి ఎల్.ఆర్.ఎస్ (లే అవుట్ రెగ్యులరేషన్) పథకం ద్వారా అనధికార లే అవుట్ ఫ్లాట్లను అధికారికంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చిన అమ్మకాని గాని కొనుగోలుకు గాని నిర్మాణానికి గాని అనుమతి పొందే విధంగా అవకాశం కలిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్.ఆర్.ఎస్. పథకం ద్వారా ప్రజలకు మరింత సులువుగా తేలికగా అక్రమార్కుల నుండి మోసపోకుండా పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తుంది. కానీ ప్రభుత్వ నిబంధనను గాలికి వదిలేసి ఓ రియల్టర్ ఉనికిచర్ల గ్రామంలో సర్వే నెంబర్ 1111,428 నంబర్లకు సంబంధించిన బై నంబర్లలో ఉన్న కాళీ భూములలో నాలతో ప్లాట్ నెంబర్ ఇచ్చి ఎల్.ఆర్.ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారట.ఇందుకుగాను భూ రియల్టర్ ఒక్కొక్కరి వద్ద 25 వేల నుంచి 50 వేల వరకు ఒక రిజిస్ట్రేషన్ కు కమిషన్ వసూలు చేస్తున్నాడట.రిజిస్ట్రేషన్ చేపిస్తాం అంతా మేమే చూసుకుంటాం అంటూ అమాయకుల వద్ద నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారని వాపోతున్న బాధితులు. ఇప్పుడే కాదు ఈ ప్రాంత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఇన్చార్జి సబ్ రిజిస్టర్ ఏకంగా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూములను కాసులకు కక్కుర్తి పడి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేశాడట. అతనిపై పలుమార్లు కంప్లైంట్ చేసిన జిల్లా ఉన్నతాధికారుల యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడమే కాకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని బాధితుల ఆరోపణ. ఇదే విషయంపై స్థానిక సబ్ రిజిస్టర్ ని వివరణ కోరగా ఇప్పటివరకు ఫ్లాట్ నెంబర్ తో ఎల్.ఆర్.ఎస్ లేకుండా మేము ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు అది కేవలం తప్పుడు సమాచారం అని తెలిపారు. అసలు ప్లాటింగ్ చేయని కాళీ స్థలంలో ఫ్లాట్ నెంబర్ ఎలా వేశారు..ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు, ఇప్పటికే ధర్మసాగర్ మండల పరిధిలో రింగు రోడ్డు ద్వారా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.దాంతో ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు ఇలాంటి సమయంలో ఇలా చేయడం ద్వారా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..రియల్టర్ అక్రమ వెంచర్ లో లేని ఫ్లాట్ నెంబర్ ద్వారా చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియతో మునుముందు సమస్యలు రావా…?వస్తే భాద్యత ఎవరిది…?మరింత ముందుకు మరో సంచికలో