
చిలుకూరు, జూన్ 06:( న్యూస్ తెలంగాణ )
గత కొంత కాలం నుండి
హుజూర్నగర్ నుండి కోదాడ వరకు ఉన్న నేషనల్ హైవే-167 రోడ్డు మీదికి రాత్రి సమయం లో గేదెలు అకస్మాత్తుగా రావడం వలన రోడ్డు పై వెళ్తున్నవాహనాలు అట్టి గేదెలకు గుద్దుకోవడం వలన ప్రమాదాలు జరిగి అట్టి గేదెలు, మనుషులు చనిపోవడం జరుగుతున్నది. కావున చిలుకూరు మండల ప్రజలకు తెలియిజేయునది మీయొక్క గేదెలను మీరే దగ్గరుండి మేపుకొని ఇండ్లలో కట్టివేసుకోగలరు, అవి రోడ్డు మీదికి రాకుండా జాగ్రత్త పడగలరు, మీ గేదెలు రోడ్డు మీదికి రావడం వలన ఎలాంటి ప్రమాదం జరిగినా మీ పై చట్ట పరమైన చర్య తీసుకోబడుతుంది. ఎస్.రాంబాబు, ఎస్ఐ ఆఫ్ పోలీసు,. చిలుకూరు.