
ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.
చిలుకూరు, జూన్ 19 🙁 న్యూస్ తెలంగాణ )
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలోని నూతన గ్రామ శాఖలు మండల శాఖలు నిర్మాణంలోని భాగంగా బుధవారం, చిలుకూరు మండల కేంద్రం లోని ఎస్సీ కాలనీలో జరిగిన, ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, నూతన గ్రామ కమిటీ ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు, మాదిగ అధ్యక్షతన నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన గ్రామ అధ్యక్షులుగా కాంపాటి రంజిత్ మాదిగ,ముదిగొండ బాలు మాదిగ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన కాంపాటి రంజిత్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించే పోరాటాల్లో భాగస్వామ్యమై. మాదిగ జాతి హక్కులకై త్వరలోనే మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిర్వహించే జులై 7న, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతనికి కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు చిలుకూరు మండల ఇన్చార్జ్, కొండపల్లి ఆంజనేయులు, మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి.రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి చిలుకూరు మండల కో ఇన్చార్జ్ ఏపూరి సత్యరాజు మాదిగ, లు పాల్గొని వారు మాట్లాడుతూ. జులై 7న, జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జెండా దిమ్మెలు నిర్మించుకొని ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగ సమాజం కోసం అంకితం చేశాడని ఆయన పోరాట ఉద్యమ ఫలితమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిందని ఈ వర్గీకరణ ఎస్సీలుగా పిలవబడే 59 ఉప కులాలకు వర్తిస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో.ఎం ఎస్ పి జిల్లా నాయకులు సిద్దెల శ్రీను మాదిగ, ఎం జె ఎఫ్ ఉపాధ్యక్షులు మల్లెపంగు ఉపేందర్ మాదిగ. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నూకపంగు వెంకటి మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వార్త విలేఖరి కంపాటి గురవయ్య మాదిగ.కందుకూరి వెంకటేశ్వర్లు, బోయిల పాపయ్య, కందుకూరి వీరయ్య,మాతంగి వీరాస్వామి, కందుకూరి నాగేష్, కందుకూరి శ్రీను, అమరారపు యల్లయ్య, మల్లేపంగు అశోక్ ముదిగొండ సైదులు, కందుకూరి వీరబాబు, మల్లేపంగు వీరయ్య, మల్లేపంగు పిచ్చయ్య, నూకపంగు జనార్దన్, నెలమర్రి యాదగిరి, గజ్జి ప్రశాంత్, నూకపంగు మణికంఠ, వడ్డేపల్లి వీరబాబు మాదిగలు పాల్గొన్నారు.