
ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, ఆగస్టు 29 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామ శివారులో గల చెగ్యాం ప్రాజెక్టుకు ఈ మధ్య కురుస్తున్న వర్షాల వల్ల మత్తడి ప్రక్కన గండిపడి నీరు వృధా అవుతుందని గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి లకు తెలపగా, ఈ విషయంపై వారు సంబంధిత నీటిపారుదల శాఖ డిఈ ధర్మకుమార్, ఏఈ ప్రవీణ్ లకు సమాచారం ఇవ్వగా శుక్రవారం రోజున వారు పలువురు రైతుల సమక్షంలో మత్తడికి పడిన గండిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సమస్య పై తక్షణమే నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామని, తొందరలోనే మత్తడికి మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్శనలో అధికారులు వెంట తాజా మాజీ సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి, సొసైటీ మెంబర్ తడవని గంగయ్య, మాజీ వార్డ్ సభ్యులు కలవేని సత్తయ్య, ముదిరాజ్ సంఘ సభ్యులు కలవేని రాజేశం, సబ్బు కేశవ్, తడవేని రాజేశం, ఆవుల సత్తయ్య, చింతకింది పోచయ్య, తడివేని రాజేశం గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.
