
- డీఈఓ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చేన్న కుమార స్వామి
ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, ఆగస్టు 29(న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో జీవశాస్త ఉపాధ్యాయుడు లేనందున విద్యార్థులు నష్టపోతున్నారనీ ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు చేన్న కుమార స్వామి పలుమార్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) రాముకు విన్నవించగా, వారి విన్నపం పై స్పందించి ఏట్టకేలకు జీవశాస్త్ర ఉపాధ్యాయుని కేటాయింపు చేసినట్లు కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారి గ్రామ పిల్లల భవిష్యత్తుకు సహకారానికి తక్షణమే స్పందించి వెల్గటూర్ మండలంలో పనిచేస్తున్న జీవ శాస్త్ర ఉపాధ్యాయుని కొండాపూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించిన సందర్భంగా శుక్రవారం రోజున జిల్లా కార్యాలయంలో విద్యాధికారి నీ కలసి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కుమారస్వామి శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో విద్యార్థులు నష్టపోకుండా విషయాన్ని పలుసార్లు జిల్లా విద్యాధికారికి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారాన్ని కృషిచేసిన కుమారస్వామిని పలువురు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.