
- తాజా మాజీ సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి
ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, సెప్టెంబర్ 10(న్యూస్ తెలంగాణ):
రైతు వేదిక క్లస్టర్ల ప్రకారంగా రైతులకు యూరియా ఇప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి లు పత్రికా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి పంట పొట్ట దశలో ఉన్నందున తప్పనిసరిగా పొలానికి యూరియా వేయవలసి వస్తుందని, యూరియా బస్తాలను వివిధ దుకాణాల ద్వారా ఇవ్వడం వలన ప్రతి రైతుకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, గత బారాసా ప్రభుత్వం ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చిన, ఎరువుల కొరత ఏర్పడిన రైతు వేదికల ద్వారా రైతులకు ప్రభుత్వ సహాయం అందుతుందనే ఆలోచనతో రైతు వేదికలు ఎర్పాటు చేయడం జరిగిందన్నారు, అట్టి రైతు వేదికల ద్వారా ఇప్పుడు యూరియా కొరత ఉన్నందున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎండపల్లి మండలంలోని అన్ని రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు, యూరియా కొరత విషయాన్ని గమనించి వ్యవసాయ అధికారులు నివేదికలు ఏర్పాటు చేసు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్కువ సమయంలో యూరియా రైతులకు అందే విధంగా కృషి చేయాలన్నారు, లేనిచో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తప్పకుండా రైతుల గోడు పట్టించుకుని గోడిశెలపేట క్లస్టర్ లో సొసైటీ వారి ద్వారా యూరియా పంపిణీ చేయాలని కోరారు.