
ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, సెప్టెంబర్ 24 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలో శ్యామల అనే వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మహిళా కుమారుడు పొనుగోటి సతీష్ రావ్ తెలిపిన వివరాల ప్రకారం…. అతని తల్లి పొనుగోటి శ్యామల (68) ను బుధవారం రోజున సాయత్రం సమయంలో గౌరవెల్లి ధర్మారావు అను వ్యక్తి పాత కక్షలతో కుట్ర పెంచుకుని గ్రామపంచాయతీ ఆవరణలో, అసభ్య పదజాలంతో తిడుతూ దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్లు ఆయన తెలిపారు. గతంలో అతని తండ్రి కిష్టరావును సైతం గాయపరిచి హత్య యత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని తల్లి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతునట్లు తెలియజేశారు. అతని తల్లి పై జరిగిన దాడిని కండిస్తూ తగిన న్యాయం చేయవలసిందిగా సతీశ్ రావ్ కోరుచున్నాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.