
- ప్రతి లబ్ధిదారునికి తరువాతి విడతలో అందజేస్తాం
- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, సెప్టెంబర్ 24 (న్యూస్ తెలంగాణ):
అర్హులైన ప్రతి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలలో బుధవారం రోజున అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేసారు. ఈ సందర్భంగా 14 మంది మారేడుపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు, ముంజంపెల్లి గ్రామానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుందని, అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఎంత మంది అర్హులైన పేద లబ్ధిదారులు ఉంటే అంత మందికి ఇళ్లను మంజూరు చేస్తామని, ప్రభుత్వం నుండి అందించే 5 లక్షల రూపాయలను దశల వారిగా లబ్ధిదారులకు అందియడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక – జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోల్ల తిరుపతి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, అనుమాల మంజుల, బాలసాని మల్లేశం గౌడ్, సింగిరెడ్డి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.