
- ఘనంగా అంబేద్కర్ చౌరస్తాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
- పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
మేడిపల్లి సెప్టెంబర్ 30( న్యూస్ తెలంగాణ)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భవానీ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంచల నర్సింగ్ రావు ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని శ్రీ శ్రీ శ్రీ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దానగళ్ళ యాదగిరి,మాల్లేష్,దర్శన్, శ్రీనివాస్ గుప్తా,మధు,కె నర్సింహ్మ,ఎర్ర యాదగిరి, చెంచల్ల శ్రీనివాస్, ఉప్పరి విజయ్, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.