October 16, 2025
News Telangana
Image default
Telangana

ప్రజా ప్రభుత్వం లో వరి ధాన్యం కొనుగోలు

జుక్కల్ ప్రతినిధి, 1 అక్టోబర్, న్యూస్ తెలంగాణ :- ఖత్గావ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీనియర్ నాయకులు శంకర్ పటేల్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కొంగల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చి మద్దత్తు ధర పొందాలని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం తేమతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, దళారీలకు విక్రయించి మోసాలకు గురికావద్దని ఆయ నన తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొరత, ఇతరత్రా సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సిద్రాం పటేల్ ,రాజు పటేల్ వీరు పటేల్ ,నర్సారెడ్డి సర్పంచ్ జీవన్,సంతోష్ రెడ్డి,మన్ను,పంచాయతీ కార్యదర్శి యశ్మీన్,ఐకేపీ సిబ్బంది,రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు

0Shares

Related posts

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

News Telangana

గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్

News Telangana

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

News Telangana

Leave a Comment