
- వి పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు పిజేఆర్ స్టేడియం లో ఘనంగా జరిగింది
- బతుకమ్మ పండుగ సంబరాలలో రామకార్యానికి ఉడత సహాయంల అన్నప్రసాద సేవను చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు, కాట్ల చంద్రశేఖర్ రెడ్డి
శేరిలింగంపల్లి, అక్టోబర్01 (న్యూస్ తెలంగాణ):-
సద్దులబతుకమ్మ పండుగ పర్వదిన శుభసందర్భంగా శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ పి జె ఆర్ స్టేడియంలో శ్రీమతి.వి పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు పిజేఆర్ స్టేడియం లో వైభవోపేతంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కాల్వ సుజాత,ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,సోషల్ మీడియా చైర్మన్ సమ రామ్మోహన్ రెడ్డి, ఆల్విన్ కాలనీ124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి,యాదగిరి గౌడ్,పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు వీ.జగదీశ్వర్ గౌడ్,మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలను గౌరవిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అడపడుచులందరు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ అందరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నాయకులు కాట్ల చంద్రశేఖర్ రెడ్డి, మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు విచ్చేసి బతుకమ్మ ఆడిన మహిళలందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.గతసవసరంల యీ ఈసారికూడా బతుకమ్మ పండుగ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించినా శ్రీమతి వీ,పూజిత జగదీశ్వర్ గౌడ్ కి మరియు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ స్థాపకులు టీపీసీసీ శేర్లింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ వీ,జగదీశ్వర్ గౌడ్ గారికి దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, బతుకమ్మ పండుగ సంబరాలలో రామకార్యానికి ఉడత సహాయంల అన్నప్రసాద సేవను చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు అలాగే నాకు సహకరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ,కాట్ల చంద్రశేఖర్ రెడ్డి. శేరిలింగంపల్లి ప్రజలకు,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు,కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకురాళ్లు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.