
న్యూస్ తెలంగాణ /సంగారెడ్డి జిల్లా :- సదాశివపేట పట్టణంలో చిన్న బసవేశ్వర్ మందిరం లో శ్రీ మాత్రే అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరత్నాల సందర్బంగా దుర్గామాత మండపం వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. …పూజ కార్యక్రమం లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు…శ్రీ మాత్రే అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సన్మానించారు. ..నవరాత్రుల పర్వదినాల్లో దుర్గామాతను ఆరాధించడం ద్వారా సమాజానికి శాంతి, సుభిక్షం కలుగుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ప్రజలు ఐక్యంగా ఉండి మాత అశీస్సులు పొందాలని ఆకాంక్షించారు…కార్యక్రమంలో జీర్లపల్లి వెంకన్న, అజయ్, పెద్ద గౌడ్, ఉల్లిగడ్డల నాగు, కంది మల్లేశం, పాండు ఉన్నారు.