
పటాన్చెరు: అక్టోబర్ 1 (న్యూస్ తెలంగాణ)
దసరా పండుగ శుభ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నాం. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది’ అని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో పండగ నిర్వహించుకోవాలని కోరారు.